సునీల్-వాసువర్మల సినిమా టైటిల్ కన్‌ఫర్మ్!

Krishnashtami
‘జోష్’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన వాసు వర్మ, హీరో సునీల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కమెడియన్‌ నుంచి హీరోగా మారిన సునీల్‌, మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయినా ఈమధ్య కాస్త వెనుకబడ్డారు. ఈ అపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో సునీల్ మళ్ళీ హీరోగా తన వైభవాన్ని నిలబెట్టూకునే దిశగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే సునీల్, వాసువర్మతో చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌మైనర్‌పై దృష్టి సారించారు.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘కృష్ణాష్టమి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు వాసు వర్మ మాట్లాడుతూ.. “ఇది ఒక చక్కటి ఫామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా ‘కృష్ణాష్టమి’. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫ్యామిలీ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్” అని తెలిపారు. నిక్కి గల్రాని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించగా, ప్రముఖ రచయిత కోనా వెంకట్ కథ ను సమకూర్చారు.

Exit mobile version