మన టాలీవుడ్ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణతో సాలిడ్ మాస్ చిత్రం “వీరసింహా రెడ్డి” హిట్ తర్వాత ఊహించని విధంగా బాలీవుడ్ ప్రముఖ హీరో సన్నీ డియోల్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని అయితే అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తూ వచ్చి ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ని సన్నీ బర్త్ డే కానుకగా అందించారు.
ఈ చిత్రం నుంచి సన్నీ డియోల్ పై ఒక పవర్ఫుల్ యాక్షన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఈ చిత్రానికి “జాట్” అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. దీనితో వీరి క్రేజీ కలయికలో వస్తున్న సినిమాపై ఓ సస్పెన్స్ వీడింది అని చెప్పాలి. మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సన్నీ డియోల్ సాలిడ్ పర్సనాలిటీతో వైలెంట్ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది.
అలాగే తన చేతిలో పెద్ద ఫ్యాన్ కూడా గమనించవచ్చు. దీనితో తెలుగు సహా హిందీ మాస్ ఆడియెన్స్ ఈ సినిమా గట్టి ట్రీట్ నే ఇచ్చేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Introducing the man with a national permit for MASSIVE ACTION ????????@iamsunnydeol in and as #JAAT ❤️????#SDGM is #JAAT ????
Happy Birthday Action Superstar ✨
MASS FEAST LOADING.
Directed by @megopichand
Produced by @MythriOfficial & @peoplemediafcy #HappyBirthdaySunnyDeol… pic.twitter.com/zbGDsZgMjq— Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2024