మంచు విష్ణు “జిన్నా” నుంచి సన్నీ లియోన్ ఇంట్రెస్టింగ్ లుక్ రివీల్.!

మంచు విష్ణు “జిన్నా” నుంచి సన్నీ లియోన్ ఇంట్రెస్టింగ్ లుక్ రివీల్.!

Published on Aug 10, 2022 12:37 PM IST


టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా చేస్తున్నటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు సూర్య తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ చిత్రం “జిన్నా” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన క్రేజీ అప్డేట్స్ కూడా మంచి ఆసక్తి రేపగా రీసెంట్ గానే ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లుక్ ని రివీల్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరో ప్రముఖ నటి సన్నీ లియోన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు మేకర్స్ అయితే ఈమె లుక్ ని మరియు ఆమె రోల్ ని రివీల్ చేశారు. మరి ఈ చిత్రంలో ఈమె అయితే రేణుక అనే పాత్రలో నటిస్తున్నట్టుగా ఆమె నుంచి ఒక స్టైలిష్ మరియు గ్లామ్ లుక్ ని అయితే రివీల్ చేశారు. మరి ఇది అయితే సింపుల్ అండ్ క్లీన్ గా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి కోనా వెంకట్ రచన అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎవిఎ ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు