‘గుంటూర్ టాకీస్ 2’లో సన్నీలియోన్..!

3rd, October 2016 - 09:06:15 AM

sunny-leone
దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన అడల్ట్ కామెడీ ‘గుంటూర్ టాకీస్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళనే రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గుంటూర్ టాకీస్ 2’ తెరకెక్కనుంది. సీనియర్ నటుడు నరేష్, నాటితరం హీరో వినీత్ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ సినిమాను రాజ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాలో సన్నీలియోన్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

ఇండియన్ సినిమాలో పాపులర్ పేర్లలో ఒకరైన సన్నీ లియోన్ చేయబోయే రెండో సినిమా ‘గుంటూర్ టాకీస్ 2’ కానుండడం విశేషంగా చెప్పుకోవాలి. నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. గుంటూర్ టాకీస్‌తో నటుడిగా తన స్థాయి పెంచుకున్న నరేష్, సీక్వెల్‌లోనూ అదే స్థాయిలో ఆకట్టుకుంటారట. ఇక సన్నీ లియోన్ కీలక పాత్ర చేస్తున్నారన్నది ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కావాల్సి ఉంది.