“గాలి నాగేశ్వరరావు” కోసం సన్నీలియోన్ గట్టిగానే తీసుకుంటుందట..!

Published on Mar 19, 2022 8:21 pm IST

హీరో మంచు విష్ణు ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఫేమ్ ఈషాన్ సూర్య దర్శకత్వంలో ‘గాలి నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తిరుపతిలో ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ కీలక పాత్రలు పోశిస్తున్నారు. అయితే సాధారణంగా సన్నీలియోన్ తెలుగు సినిమాలో ఎక్కువగా కనిపించదు. ఆమెకు ఉన్న క్రేజ్ పరంగా భారీగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుందని నిర్మాతలు కూడా భయపడి వెనకడుగు వేస్తుంటారు.

అయితే ఇప్పుడు “గాలి నాగేశ్వరరావు” సినిమాలో రేణుక అనే ఎన్నారై పాత్రలో సన్నీలియోన్ కనిపించబోతుంది. అయితే ఈ సినిమా కోసం సన్నీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటందనేది ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. ఈ సినిమా కోసం కేవలం 20 రోజులు మాత్రమే సన్న్నీ షూటింగులో పాల్గొంటుందని, అందుకుగాను ఆమె ఏకంగా రెండున్నర కోట్లు తీసుకుంటుందని సమాచారం.
ఇకపోతే మోహన్ బాబు గారి ఆశీస్సులతో ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథ మరియు స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్‌ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :