‘టెంపర్’ సినిమాలో సన్నీలియోన్ !

ఎన్టీఆర్- పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ‘టెంపర్’ సినిమా ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా అని తెలిసిన విషయమే. అయితే ఈ చిత్రం తమిళ్ రీమేక్ లో విశాల్ మరియు రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే కీలక షెడ్యూల్ ను పూర్తీ చేసుకున్న ఈ చిత్రం చాలా బాగా వస్తుందట. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య సాగే కొన్ని సన్నివేశాలు బాగా అలరిస్తాయని చెబుతుంది చిత్రబృందం.

కాగా తాజాగా కోలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉందట, ఆ సాంగ్ లో విశాల్ సరసన సన్నీలియోన్ స్టెప్పులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సన్నీలియోన్ చిత్రబృందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రాశి ఖన్నా హీరోయిన్ గా వచ్చే ఈ సినిమా పొంగల్ కు రిలీజ్ కాబోతున్నది.

ఎ.ఆర్ మురుగదాస్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘అయోగ్య’ అనే పేరు పెట్టారు.

Exit mobile version