సన్నీ లియోన్ కి చిన్న గాయాలు

sunny-leone
‘కరెంట్ తీగ’ చిత్రం ద్వారా సన్నీ లియోన్ త్వరలో తెలుగు తెరకు పరిచయంకానుంది. అయితే ఇప్పటివరకు సన్నీ ఈ చిత్రం ప్రమోషన్ కి దూరంగా ఉండడానికి కారణం బయటపడింది. ప్రస్తుతం సన్నీ ఒక బాలీవుడ్ కామెడీ షూటింగ్ లో బిజీగా వుంది. ఈ చిత్రం షూటింగ్ లో సన్నీ కి చిన్న గాయాలు అయ్యాయి. ‘నా మెడ బెనికింది కదలలేకపోతున్నా.. రాత్రంతా పడుకోలేదు కదలలేకుండా వుండడం చాలా కష్టంగా వుంది. మిగిలినవన్నీ బాగానే వున్నాయి. కాంబిఫ్లేమ్ తో పాటు టైగర్ బామ్ తీసుకున్న రేపు ఉదయనికి ఒక అద్బుతం జరిగి నా మెడ కదలితే నా మొదటి షాట్ లో పాల్గోవచ్చు’ అని సన్నీ తన బ్లాగ్ లో పెర్కుంది.

‘కరెంట్ తీగ’ లో సన్నీగీతం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ పాటలో సన్నీ తన నటనతో డాన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని నిర్మాతలు చాలా విశ్వాసంగా వున్నారు.

Exit mobile version