సప్రైజ్ ఇవ్వనున్న సన్నీ లియోన్ !
Published on Oct 17, 2017 4:20 pm IST

బాలీవుడ్ హాట్ స్టార్ సన్నీ లియోనీ తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఉర్రూతలూగింస్తోంది. ఇప్పటికే ‘కరెంట్ తీగ’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు మరొక చిత్రంతో టాలీవుడ్ ను పలకరించబోతోంది. అదే సీనియర్ హీరో రాజశేఖర్ ‘పిఎస్వీ గరుడవేగ’. ప్రవీణ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం చివరి దశల పనుల్లో ఉంది. నవంబర్ 3న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ చిత్రంలో సన్నీ లియోనీ ‘డియో డియో’ అనే ఒక ప్రత్యేక గీతం చేస్తోంది. ఈ మధ్యే విడుదలైన ఈ పాట ప్రేక్షకుల్ని బాగా అలరిస్తోంది. ఈ నెల 27న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్లో సన్నీ లియోన్ పాల్గొనడమేగాక లైవ్లో ‘డియో డియో’ పాటకు కాసేపు డ్యాన్స్ కూడా చేయనుందట. ఇంకేముంది వేడుకకు హాజరైన వారికి కనులపండుగే మరి.

 
Like us on Facebook