ఐటమ్ పాటకు సిద్దమవుతున్న సన్నీ లియోని!


బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోని తెలుగు తెరను వేడెక్కించేందుకు సిద్దమవుతోంది. గతంలో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘కరెంటు తీగ’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ బాలీవుడ్ భామ డా.రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పిఎస్వి గరుడవేగ’లో ఐటమ్ సాంగ్ చేయనుంది. ఈ పాత చిత్రీకరణ ముంబైలోని ఫిలిం సిటీలో జరగనుంది. ఈ పాట కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ విష్ణు దేవ ఈ పాటకు నృత్యాలను కంపోజ్ చేయనున్నారు. చాలా కాలం తర్వాత రాజశేఖహ్ర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనునం ఈ చిత్రాన్ని ‘గుంటూరు టాకీస్’ దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో విశ్వరూపం’ ఫేమ్ పూజా కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదివరకే రిలీజైన ఫస్ట్ లుక్ పాజిటివ్ స్పందన తెచ్చుకోగా ఈ చిత్రం తనకు మునుపటి గుర్తింపును తెచ్చిపెడుతుందని రాజశేఖర్ భావిస్తున్నారు.