బిగ్ బాస్ 5: ఎలిమినేషన్ నుండి సేవ్ అయిన సన్నీ!

Published on Nov 30, 2021 3:43 pm IST


బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో రోజురోజుకీ మరింత ఆసక్తి గా సాగుతోంది. ఈ షో లో ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండటం తో బిగ్ బాస్ ఫైనల్ రేస్ మరింత వేడెక్కుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా నిన్న సాధారణ పద్దతి లో నామినేషన్లు జరిగాయి.

అయితే ఎప్పటిలాగానే అందరూ నామినేట్ అయ్యారు. సన్నీ మాత్రం నామినేషన్ నుండి తప్పించుకున్నాడు. సన్నీ నామినేట్ కాకపోవడం తో కాజల్, సిరి, ప్రియాంక లలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే షో లో ఎవరు ఉండనున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. షణ్ముఖ్ తో పాటుగా సన్నీ కూడా సేవ్ అవ్వడం తో ఫైనల్ లో ఎవరు ఉంటారు అనేది మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :