ప్రభాస్ తో బంధం ఎప్పటికీ బలంగానే ఉంటుందట !

Published on Nov 7, 2021 11:32 pm IST

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “ఏ- ఆది పురుష్”. కాగా ఈ సినిమాలో లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో సన్నీ సింగ్ షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తి అయింది. అయితే, సన్నీ సింగ్ మాత్రం ఇంకా షూటింగ్ మూడ్‌లో ఉన్నట్టు ఉన్నాడు. తాజాగా ఆది పురుష్ షూటింగ్ మొదలై వంద రోజులు అవుతున్న సందర్భంగా సన్నీ సింగ్ ఓ పోస్ట్ పెట్టాడు.

తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘జీవితం ముందుకు వెళ్తున్న క్రమంలో మన దారులు వేరు అవ్వొచ్చు. అయితే, మన బంధం మాత్రం ఎప్పటికీ బలంగానే ఉంటుంది. మీతో కలిసి నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది బిగ్ బ్రదర్.. ఆది పురుష్‌కు వంద రోజులు’ అంటూ సన్నీ సింగ్ పోస్ట్ చేశాడు.

రామాయణంలో రామలక్ష్మణులు ప్రేమ ఎలా ఉంటుందో తెలిసిందే. కాగా తెర పై ఆ పాత్రలను పోషించిన ప్రభాస్, సన్నీ సింగ్‌ల మధ్య కూడా మంచి బంధం ఏర్పడినట్టు ఉంది.

సంబంధిత సమాచారం :