సూపర్ క్లిక్ : లేటెస్ట్ యాడ్ షూట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు

Published on Sep 9, 2023 11:01 pm IST

టాలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ చేస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ వ్యయంతో ఈ మూవీని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

ఇక ఇటు సినిమాలతో పాటు అటు వరుసగా పలు యాడ్స్ లో కూడా నటిస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు సూపర్ స్టార్. అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఒక కమర్షియల్ యాడ్ షూట్ లో పాల్గొన్నారు మహేష్ బాబు. అయితే ఈ యాడ్ కి సంబంధించి టీమ్ తో కలిసి తాజాగా మహేష్ బాబు దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇక ఈ పిక్ లో ఫార్మల్ కాస్ట్యూమ్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ గా అదరగొట్టారు.

సంబంధిత సమాచారం :