నిఖిల్ సిద్ధార్థ్ “కార్తికేయ 2” పై సర్వత్రా ఆసక్తి!

Published on Aug 12, 2022 2:42 pm IST

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కార్తికేయ2. కార్తికేయ చిత్రం కి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఇప్పటికే మంచి బజ్ ను సొంతం చేసుకుంది. బుక్ మై షో లో 60కే కి పైగా ఇంట్రెస్ట్ లను సొంతం చేసుకొని మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అనుపమ పరమేశ్వరన్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం ను రేపు, ఆగస్ట్ 13, 2022 న భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :