తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి,సమంత ,రమ్యకృష్ణన్ , ఫహద్ ఫాజిల్ , మిస్కిన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం సూపర్ డీలక్స్. త్యాగరాజన్ కుమార రాజా తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో కనిపించనుండగా రమ్యకృష్ణన్ శృంగార తార గా నటించింది.
డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో రానున్న ఈచిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మార్చి 29 న విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది . అయితే ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారో తెలియాల్సి వుంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
