ఈసారి చరణ్ బర్త్ డే కి అదిరిపోయే గిఫ్ట్.!

Published on Jan 28, 2023 7:20 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన సినిమా RRR సక్సెస్ తో పాన్ వరల్డ్ అపీల్ ని అయితే సొంత చేసుకున్నాడు. మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ సినిమా చేస్తుండగా దీనిపై కూడా అనేక అంచనాలు ఉన్నాయి. అయితే చరణ్ నటించిన చిత్రాల్లో ఇండస్ట్రీ నుంచి పలు బిగ్గెస్ట్ హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. ఇప్పటి వరకు తాను చేసిందే 14 సినిమాలు అయినా వాటిలో తన రెండో సినిమాతోనే చరణ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

మరి ఆ సినిమానే “మగధీర” కాగా ఈ చిత్రాన్ని కూడా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం అసలు సిసలైన మాసివ్ రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ని ఈ ఏడాది చరణ్ బర్త్ డే కానుకగా అయితే నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వారు ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో కాజల్ నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :