“అచ్చ తెలుగందమే”తో ఆకట్టుకున్న అశోక్ గల్లా !

Published on Oct 25, 2021 10:16 am IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఈ ‘హీరో’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాకి జీబ్రాన్‌ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా ఓ లిరికల్ వీడియో గీతాన్ని రిలీజ్ చేసింది టీమ్.

“అచ్చ తెలుగందమే” అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంది. హీరో ప్రేమలో పడిన సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. ఇక ఈ పాటలో అశోక్‌ గల్లా లుక్స్ అండ్ డ్యాన్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. కాస్ట్యూమ్స్‌, సెట్స్‌ పాటకు సరిగ్గా సరిపోయాయి. నిధి గ్లామర్ ఈ పాటకి మరో ప్రత్యేక ఆకర్షణ. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అశోక్ గల్లా మొదటి సినిమా కాబట్టి సినిమా క్వాలిటీ విషయంలో ఏమాత్రం వెనుకాడలేదు నిర్మాత. ఇక నటుడిగా నిరూపించుకునేందుకు అశోక్ గల్లా గట్టి ప్రయత్నం చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :