“హనుమాన్‌” నుండి సూపర్‌హీరో హనుమాన్ సాంగ్ రిలీజ్!

Published on Nov 14, 2023 7:17 pm IST


సూపర్‌హీరో హనుమాన్‌ని పెద్ద స్క్రీన్‌లపై చూడటానికి సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించారు. నావెల్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయడమే కాకుండా ప్రమోషన్స్‌లోనూ తన క్రియేటివిటీని చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. రెండవ సింగిల్, సూపర్ హీరో హనుమాన్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ బాలల దినోత్సవాన్ని ఎందుకు ఎంచుకుంది అని చాలా మంది ఆశ్చర్యపోయారు.

అయితే దానికి సమాధానం పాట చూసిన తర్వాత తెలుస్తుంది. అనుదీప్ దేవ్ కంపోజ్ చేసిన పాటకి, కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ఈ సాంగ్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.
ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్‌ పై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హను-మాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి చిత్రం. ఇది అంజనాద్రి అనే ఊహాత్మక ప్రదేశంలో సెట్ చేయబడింది. హనుమాన్ 2024 జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :