తెలుగులో రీమేక్ కానున్న బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ?


టాలీవుడ్ లో రీమేక్ ల జోరు కొనసాగుతూనే ఉంది.పరభాషలలో విజయం సాధించిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేయడం ప్రస్తుతం కామన్ అయిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన చిత్రం జూలీ ఎల్ ఎల్ బి 2 గత ఫిబ్రవరి నెలలో విడుదలై ఘన విజయం సాధించింది.బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

కాగా ఈచిత్రాన్ని తెలుగు రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్ర రీమేక్ కి సంబందించిన వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ ఈ చిత్ర రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.