ప్రభాస్ “ఆదిపురుష్” సెకండ్ సింగిల్ కి అద్దిరిపోయిన రెస్పాన్స్!

ప్రభాస్ “ఆదిపురుష్” సెకండ్ సింగిల్ కి అద్దిరిపోయిన రెస్పాన్స్!

Published on May 30, 2023 10:01 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాముడు గా నటిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం ను జూన్ 16, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, ట్రైలర్ లు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన జై శ్రీరామ్ ఇండియా లోనే సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ రామ్ సీతా రామ్ కూడా అదే ట్రెండ్ ను కొనసాగిస్తుంది. హిందీ లో 33 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతుంది. మిగతా బాషల్లో ఈ పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు