తలా అజిత్ కుమార్ ‘తునీవు’ ఫస్ట్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్

తలా అజిత్ కుమార్ ‘తునీవు’ ఫస్ట్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్

Published on Dec 10, 2022 2:00 AM IST


కోలీవుడ్ స్టార్ యాక్టర్ తలా అజిత్ కుమార్ హీరోగా బోనీ కపూర్ బే వ్యూస్ ప్రాజక్ట్స్ ఎల్ ఎల్ పి, జీ స్టూడియోస్ సంస్థలు పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతోన్న లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ తునీవు. మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో సముద్రఖని, మమతి చారి, వీర, ప్రేమ్ కుమార్, అజయ్, సిబీ చంద్రన్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న తునీవు మూవీ పై అజిత్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటీవల అజిత్ తో తెరకెక్కించిన వలిమై మూవీతో మంచి విజయం అందుకున్న దర్శకడు హెచ్ వినోద్ ఈ మూవీని కూడా ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కించినట్లు చెఫ్తోంది యూనిట్. ఇక ఈ మూవీ నుండి నేడు చిల్లా చిల్లా అనే పల్లవితో సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ని యూట్యూబ్ లో కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్. కాగా జీబ్రాన్ సంగీతం అందించిన ఆ మాస్ బీట్ సాంగ్ ని అనిరుద్, జీబ్రాన్, వైసాగ్ కలిసి అద్భుతంగా పాడారు. యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటూ సూపర్ రెస్పాన్స్ తో ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్, లైక్స్ తో దూసుకెళుతోంది. కాగా ఈ మూవీని తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే తెలుగు మూవీ టైటిల్ మరియు ఇతర వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు