ప్రైమ్ వీడియో లో సత్తా చాటుతోన్న “బలగం”

Published on Mar 26, 2023 7:30 pm IST

ఒక చిత్రం థియేటర్లలో మరియు ఓటిటి లో ఒకేసారి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది అరుదు. ఇటీవలి బ్లాక్ బస్టర్ బలగం చిత్రం అటు థియేటర్ల లో, ఇటు ఓటిటి లో సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం సడెన్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటిటి అరంగేట్రం చేసింది. వేణు యేల్దండి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ చిత్రం ఇప్పుడు ఇండియా లోని ప్రైమ్ వీడియో చార్ట్‌లలో రెండవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. చాలా మంది నెటిజన్లు సినిమా గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వేణు ఎమోషన్స్ ను హ్యాండిల్ చేసిన విధానానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి ఈ విలేజ్ డ్రామాని నిర్మించారు. వేణు యెల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :