బాలయ్య “సుగుణ సుందరి” కి మాస్ రెస్పాన్స్!

బాలయ్య “సుగుణ సుందరి” కి మాస్ రెస్పాన్స్!

Published on Dec 21, 2022 9:00 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహరెడ్డి. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం రిలీజ్ డేట్ కి దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన సుగుణ సుందరి పాటకి మాస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట ఇప్పటి వరకూ 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. బాలయ్య నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు