ధనుష్ ‘సార్’ మూవీ ప్రీమియర్స్ కి సూపర్ రెస్పాన్స్

Published on Feb 17, 2023 2:00 am IST


ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్. తమిళ్ లో వాథి టైటిల్ తో బైలింగువల్ మూవీగా రిలీజ్ కానున్న ఈ మూవీ పై ధనుష్ ఫ్యాన్స్ లో అలానే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నుండి ఇప్పటికే జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ వంటి వాటికి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

విద్యావ్యవస్థలో జరుగుతున్న కొన్ని అక్రమాల ఆధారంగా తెరకెక్కిన సార్ మూవీ రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుండగా నేడు ఈ మూవీ యొక్క ప్రీమియర్ షో లని ప్రత్యేకంగా ప్రదర్శించారు. కాగా ఈ షో లకి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా సినిమాలో తీసుకున్న పాయింట్ ని దర్శకుడు వెంకీ అట్లూరి ఎంతో బాగా తెరకెక్కించారని, అలానే ధనుష్ క్యారెక్టర్ కూడా ఎంతో పవర్ఫుల్ గా అదిరిపోయిందని అంటున్నారు. మరోవైపు ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. మొత్తంగా ప్రీమియర్స్ తో మంచి టాక్ సంపాదించిన సార్ మూవీ రేపు ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :