అడివి శేష్ “హిట్2” ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!

Published on Nov 24, 2022 1:01 pm IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ వరుస చిత్రాలు చేస్తూ తన కెరీర్ లో బిజీగా ఉన్నారు. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్2. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న గ్రాండ్ గా రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ విడుదల అయిన కొద్దిసేపటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటి వరకూ 4 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంత చేసుకొని యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిరినేని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. జాన్ స్టీవర్ట్ ఎడురి ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. డిసెంబర్ 2 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :