మెగాస్టార్ “బాస్ పార్టీ” కి సూపర్ రెస్పాన్స్!

మెగాస్టార్ “బాస్ పార్టీ” కి సూపర్ రెస్పాన్స్!

Published on Dec 14, 2022 6:09 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం ను సంక్రాంతి పండుగ బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నుండి బాస్ పార్టీ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ పాటకి యూ ట్యూబ్ లో అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ పాటకు 25 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ పాట లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేల మెగాస్టార్ చిరంజీవి సరసన డాన్స్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో రవితేజ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు