మెగాస్టార్ “గాడ్ ఫాదర్” ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!

Published on Sep 29, 2022 11:01 am IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా ను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ ల పై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 5, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ప్రమాషన్స్ ను సైతం వేగవంతం చేయడం జరిగింది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుక లో చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ ట్రైలర్ కి 6 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

నయనతార లేడీ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, సత్యదేవ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :