మెగాస్టార్ “బాస్ పార్టీ” కి మాస్ రెస్పాన్స్!

Published on Nov 24, 2022 4:41 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన టైటిల్ టీజర్ కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం నుండి బాస్ పార్టీ సాంగ్ ను నిన్న చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ పాటకు అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ కి యూ ట్యూబ్ లో 9.5 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, 250 కే కి పైగా లైక్స్ వచ్చాయి. అంతేకాక ఈ సాంగ్ కి ఫ్యాన్స్ రీల్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ చిత్రం లో మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్, కేథరిన్ థెరిస్సా లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :