“నాటు నాటు” వీడియో సాంగ్ కి భారీ రెస్పాన్స్!

Published on Apr 12, 2022 6:05 pm IST


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాక బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం లో నాటు నాటు పాటకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా నిన్న ఈ చిత్రం నుండి నాటు నాటు వీడియో సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ పాటకు 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా థియేటర్లలో విడుదల కి ముందు సైతం ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :