నాగార్జున “ది ఘోస్ట్” కిల్లింగ్ మెషీన్ కి సూపర్ రెస్పాన్స్!

Published on Jul 12, 2022 8:00 pm IST

అక్కినేని నాగార్జున లీడ్ రోల్ లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వం తెరకెక్కుతున్న తాజా చిత్రం ది ఘోస్ట్. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ల పై ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా పై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ది ఘోస్ట్ కిల్లింగ్ మెషీన్ పేరిట విడుదలైన వీడియో యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ ఈ వీడియో కి 4.6 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం జరిగింది. భరత్, సౌరభ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖ సురేంద్రన్, మనీష్ చౌదరీ, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 5, 2022 న విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :