నాని “దసరా” టీజర్ కి అద్దిరిపొయిన రెస్పాన్స్!

Published on Jan 31, 2023 7:00 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న రా అండ్ విలేజ్ డ్రామా దసరా. ఈ చిత్రాన్ని మార్చ్ 30, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ కి దగ్గర పడుతుండటం తో మేకర్స్ ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. నిన్న ఈ చిత్రం టీజర్ ను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడం జరిగింది.

ఈ టీజర్ తెలుగు లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. మిగతా భాషల్లో సైతం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో ఈ టీజర్ 7 మిలియన్స్ వ్యూస్ ను సాధించింది. మొత్తం గా ఈ టీజర్ 13 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సాధించి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. రిలీజైన టీజర్ సినిమా పై భారీ అంచనాలను పెంచేసింది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :