“ఓరి దేవుడా” సర్ప్రైజ్ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్!

Published on Sep 23, 2022 5:01 pm IST

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ రొమాంటిక్ ఫాంటసీ డ్రామాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. అయితే వెంకటేష్ కి సంబంధించిన సర్ప్రైజ్ గ్లింప్స్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వెంకటేష్ ఈ చిన్న వీడియో లో దేవుడిగా మెప్పించాడు. వెంకటేష్ మరియు విశ్వక్ మధ్య ఆసక్తికరమైన సరదా కోణాన్ని ఈ వీడియో లో చూపించడం జరిగింది. ఈ వీడియో కి ఇప్పటి వరకూ 6 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ సర్ప్రైజ్ వీడియో సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

ఈ సినిమా అక్టోబర్ 21 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం తమిళం లో సూపర్‌హిట్ అయిన ఓ మై కడవులే చిత్రానికి అధికారిక రీమేక్. ఒరిజినల్‌ లో విజయ్ సేతుపతి పోషించిన దేవుడి పాత్రను వెంకటేష్ పోషించనున్నారు. తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన అశ్వత్ నారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిథిలా పార్కర్ కథానాయిక గా నటిస్తుంది. PVP సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :