ప్రభాస్ “సలార్” రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తో సోషల్ మీడియా షేక్!

Published on Aug 16, 2022 7:00 am IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 28, 2023 లో ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ తో అనౌన్స్ చేశారు.

ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో భారీగా లైక్స్, షేర్స్ తో దూసుకు పోతుంది. ప్రభాస్ మేకోవర్ పై సైతం ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్ కి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్ చిత్రాల తర్వాత చేస్తున్న చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :