రవితేజ “రావణాసుర” ప్యార్ లోనా పాగల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్!

Published on Feb 21, 2023 1:32 pm IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రావణాసుర. ఈ చిత్రం లో టాలీవుడ్ యంగ్ యాక్టర్ సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్ లపై అభిషేక్ నామా మరియు రవితేజ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

అయితే ప్యార్ లోనా పాగల్ సాంగ్ ను రెండు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో ఈ సాంగ్ 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో అను ఇమ్మన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఏప్రిల్ 7, 2023 న ఈ చిత్రం ను వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :