రామ్ – బోయపాటి మూవీ ఫస్ట్ థండర్ కి సూపర్ రెస్పాన్స్

Published on May 15, 2023 8:02 pm IST

రామ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం ఒక మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని పాన్ ఇండియన్ రేంజ్ లో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ థండర్ గ్లింప్స్ ని నేడు రామ్ బర్త్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసారు.

కాగా రామ్ మాస్ లుక్, డైలాగ్స్ తో పాటు బోయపాటి మార్క్ యాక్షన్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ థండర్ అదిరిపోయింది. ఇక ఈ థండర్ గ్లింప్స్ ప్రస్తుతం 2 మిలియన్స్ కి పైగా రియల్ టైం వ్యూస్ ని సొంతం చేసుకుని ఆడియన్స్, రామ్ ఫ్యాన్స్ యొక్క మెప్పుతో దూసుకెళుతోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ 20న గ్రాండ్ గా పలు భాషల్లో థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :