‘రామారావు ఆన్ డ్యూటీ’ మాస్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ …..!

Published on Jul 6, 2022 2:00 am IST

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేరుకూరి నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీలో రవితేజ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ‘సొట్ట బుగ్గల్లో, బుల్ బుల్ తరంగ్ సాంగ్స్ రెండూ కూడా ఆడియన్స్ ని అట్టుకున్నాయి.

సామ్ సి సంగీతం అందిస్తున్న మూవీ నుండి మూడు రోజుల క్రితం రిలీజ్ అయిన మాస్ సాంగ్ ‘ నాపేరు సీసా’. చంద్రబోస్ రాసిన ఈ మాస్ మెలోడీని ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ ఎంతో అద్భుతంగా ఆలపించగా అన్వేషిజైన్ ఇందులో సూపర్ గా డ్యాన్స్ అదరగొట్టినట్లు లిరికల్ వీడియోని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ మాస్ సాంగ్ 6 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని యూట్యూబ్ లో దూసుకెళుతోంది. కాగా ఈ సాంగ్ కి బాగా రెస్పాన్స్ రావడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈనెల 29న రిలీజ్ కానున్న ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :