రవితేజ “రావణాసుర” గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్!

రవితేజ “రావణాసుర” గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్!

Published on Jan 27, 2023 7:15 PM IST

మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలతో కెరీర్ లో దూసుకు పోతున్నారు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా రావణాసుర మేకర్స్ గ్లింప్స్ ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వీడియో కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో ఈ వీడియో కు 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం.

డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ను అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ లపై అభిషేక్ నామా, రవితేజ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుశాంత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఏప్రిల్ 7, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో లు సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు