తేజ సజ్జ “హనుమాన్” టీజర్ కి సూపర్ రెస్పాన్స్!

తేజ సజ్జ “హనుమాన్” టీజర్ కి సూపర్ రెస్పాన్స్!

Published on Nov 22, 2022 7:52 PM IST


తేజ సజ్జ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం హనుమాన్. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను మేకర్స్ నిన్న రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ రిలీజైనప్పటి నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు టీజర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ టీజర్ 24 గంటల్లో విద్వంసం సృష్టించింది.

ఈ చిత్రం 24 గంటల్లో యూ ట్యూబ్ లో 6.90 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అదే విధంగా 220 కే కి పైగా లైక్స్ ను సాధించింది. హిందీ లో రిలీజైన టీజర్ కి 4 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ తరహా రెస్పాన్స్ సూపర్ అని చెప్పాలి. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది. రిలీజైన టీజర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు