“టైగర్ నాగేశ్వర రావు” ట్రైలర్ కి అద్దిరిపోయిన రెస్పాన్స్!

Published on Oct 4, 2023 6:08 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ నాగేశ్వర రావు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ను అక్టోబర్ 20, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను మేకర్స్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది.

ఈ ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకూ 8 మిలియన్స్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అనుపమ్ ఖేర్, నుపూర్ సనన్, రేణు దేశాయ్, జిష్షు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :