“వీర సింహా రెడ్డి” సాంగ్ కి సూపర్ రెస్పాన్స్.!

“వీర సింహా రెడ్డి” సాంగ్ కి సూపర్ రెస్పాన్స్.!

Published on Nov 27, 2022 11:00 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ చిత్రం “వీర సింహా రెడ్డి”. దర్శకుడు గోపీచంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో బాలయ్య చాలా కాలం తర్వాత పవర్ ఫుల్ ఫ్యాక్షన్ డ్రామాగా చేస్తుండగా దీనిపై అనేక అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ మొన్ననే ఫస్ట్ సింగిల్ జై బాలయ్య మాస్ ఆంథెమ్ ని రీలీజ్ చెయ్యగా ఇది సాలిడ్ చార్ట్ బస్టర్ అయ్యింది.

ఇక యూట్యూబ్ లో అయితే లేటెస్ట్ గా ఏ చిత్రం సాలిడ్ రెస్పాన్స్ తో 10 మిలియన్ వ్యూస్ అందుకొని అదరగొట్టింది. దీనితో మ్యూజిక్ లవర్స్ లో ట్రోల్స్ కి సంబంధం లేకుండా మంచి రెస్పాన్స్ ని ఈ సాంగ్ అందుకుందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు