ఇళయదళపతి విజయ్ ‘లియో’ టైటిల్ ప్రోమో కి సూపర్ రెస్పాన్స్

Published on Feb 4, 2023 2:10 am IST


ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ లియో. గతంలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన మాస్టర్ మూవీ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దానితో వీరిద్దరూ కలిసి చేస్తున్న లియో పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. త్రిష, అర్జున్ సర్జా, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో బిగిన్ అయినట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ఇక లియో మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ప్రోమోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా విజయ్ స్టైలిష్ లుక్ తో పాటు అనిరుద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సాగిన ఈ ప్రోమో కి ప్రస్తుతం విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా సూపర్ గా రెస్సాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ ప్రోమో 6 మిలియన్ వ్యూస్ తో పాటు 1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. మనోజ్ పరమహంస ఫోటోగ్రఫిని అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ని అందిస్తున్న లియో మూవీ 2023 అక్టోబర్ 19న గ్రాండ్ గా ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :