విజయ్ “వరిసు” ఫస్ట్ సింగిల్‌కి అద్దిరిపోయే రెస్పాన్స్!

విజయ్ “వరిసు” ఫస్ట్ సింగిల్‌కి అద్దిరిపోయే రెస్పాన్స్!

Published on Nov 6, 2022 10:09 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ వరిసు. ఇదే చిత్రం తెలుగు లో వారసుడు పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. థమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉండనుంది అనేది ఫస్ట్ సింగిల్ కి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి చెప్పవచ్చు. రంజితమే అంటూ సాగిన ఫస్ట్ సింగిల్ కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది.

జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు మరో హైలైట్. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే 18.5 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ మరియు 1.3 మిలియన్ లైక్‌లను సాధించడం విశేషం. రష్మిక మందన్న ఈ చిత్రం లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం లో ప్రభు, జయసుధ, శ్రీకాంత్, శరత్‌కుమార్, మీనా, కుష్భు, స్నేహ, మహేశ్వరి, సంఘవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు