ఓటిటి లో సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న “విరూపాక్ష”

Published on May 24, 2023 8:18 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్ బస్టర్. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. థియేట్రికల్ రన్ తర్వాత, సినిమా ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం OTTలో కూడా సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండియా మూవీస్ విభాగంలో ఈ సినిమా అగ్రస్థానంలో ఉంది. ఎస్‌విసిసి బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో అజయ్, సాయి చంద్, శ్యామల, బ్రహ్మాజీ, సునీల్, రాజీవ్ కనకాల, సోనియా సింగ్, రవికృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఘనవిజయం వెనుక ఒక ప్రధాన కారణం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :