‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ సాంగ్ కి ఇన్స్టాగ్రామ్ లో సూపర్ రెస్పాన్స్

Published on Sep 14, 2023 9:00 pm IST

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. ఇటీవల రిలీజ్ అయి సెన్సేషనల్ సక్సెస్ సొంతం చేసుకున్న డీజే టిల్లు కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై టాలీవుడ్ ఆడియన్స్ లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ని మించేలా మరింత అద్భుతంగా దర్శకుడు దీనికి తెరకెక్కిస్తున్నారని టీమ్ చెపుతోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈమూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ టికెట్ ఏ కొనకుండా కి అందరి నుండి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సాంగ్ కి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో 50కె కి పైగా రీల్స్ లభించాయి. రామ్ మిరియాల సంగీతం అందించడంత పాటు స్వయంగా పాడిన ఈ సాంగ్ ని కాసర్ల శ్యామ్ రచించారు. మొత్తంగా తమ సాంగ్ కి ఆడియన్స్ నుండి ఇంత మంచి రెస్పాన్స్ లభించడం ఆనందంగా ఉందని అంటోంది టిల్లు స్క్వేర్ టీమ్. ఇక ఈ మూవీ అక్టోబర్ 6న ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :