కృష్ణవంశీ ‘రంగమార్తండ’ ప్రీమియర్ షో కి సూపర్ రెస్పాన్స్

Published on Mar 15, 2023 7:30 am IST

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కెరీర్ పరంగా కొద్దిపాటి గ్యాప్ అనంతరం తాజాగా తెరకెక్కించిన మూవీ రంగమార్తాండ. మరాఠీ మూవీ నట సామ్రాట్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు చేసారు. రంగస్థలం నేపథ్యంలో సాగే కథగా రూపొందిన ఈ మూవీ పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీకి అందించిన షాయరీ అందరినీ ఆకట్టుకుంది.

మరోవైపు ఇప్పటికే రిలీజ్ అయిన ఈమూవీ పోస్టర్స్, టీజర్, షాయరీ, సాంగ్స్ అన్ని కూడా అలరించి సినిమా పై ఆడియన్స్ లో బాగా అంచనాలు ఏర్పరిచాయి. అతి త్వరలో ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న ఈ మూవీ యొక్క ప్రీమియర్ షోని నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేయగా పలు సినీ, మీడియా రంగ ప్రముఖులు దీనిని ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ, నిజంగా రంగమార్తాండ ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని, ఇందులో ఆకట్టుకునే కథ, కథనాలు, పాత్రలు హృద్యమైన ఎమోషనన్స్ మన మదిని తాకుతాయని అంటున్నారు. మొత్తంగా రంగమార్తాండ ప్రీమియర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో దర్శకుడు కృష్ణవంశీ సహా యూనిట్ మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :