మాస్ రాజా ‘ధమాకా’ ట్రైలర్ కి దుమ్మురేపే రెస్పాన్స్

మాస్ రాజా ‘ధమాకా’ ట్రైలర్ కి దుమ్మురేపే రెస్పాన్స్

Published on Dec 17, 2022 12:00 AM IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా. రవితేజ ఈ మూవీలో డబుల్ రోల్ చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో దీనికి మ్యూజిక్ అందించారు. మొదటి నుండి అందరిలో భారీగా అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్ని కూడా మాస్ మహారాజ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మరింతగా క్రేజ్ ఏర్పరిచాయి.

రవితేజ మార్క్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో త్రినాధరావు తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించాయి. కాగా ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ నిన్న సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రస్తుతం ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ తో కొనసాగుతోంది. ట్రైలర్ లో రవితేజ తన మార్క్ పెర్ఫార్మన్స్, స్టైల్, యాక్టింగ్ తో ఆకట్టుకోవడంతో పాటు యక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫైట్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వంటివి అదిరిపోయాయి. ఇక ప్రస్తుతం ఈ మాస్ ట్రైలర్ రెండు రోజుల్లో మొత్తం 5 మిలియన్ వ్యూస్ తో అలానే 137కె లైక్స్ తో దూసుకెళుతోంది. కాగా ధమాకా మూవీని డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు