‘మహేష్ – త్రివిక్రమ్’ సినిమాలో మరో స్టార్ హీరో ?

‘మహేష్ – త్రివిక్రమ్’ సినిమాలో మరో స్టార్ హీరో ?

Published on Mar 21, 2022 9:01 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ అతిధి పాత్ర ఉందని.. ఆ పాత్రలో మరో స్టార్ హీరో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. అయితే, త్రివిక్రమ్ తో పవన్ కి ఉన్న సాన్నిహిత్యం కారణంగా పవనే ఆ పాత్రలో నటించే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పుకార్లులో ఎంత నిజం ఉంది అనేది చూడాలి.

ఇక ఈ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొదట ఓ ఫైట్ తో షూట్ స్టార్ట్ చేస్తారట. ఈ ఫైట్ ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

అన్నట్టు ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. కాగా హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించిబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు