“మావీరన్” గా శివ కార్తికేయన్…టైటిల్ ను అనౌన్స్ చేసిన సూపర్ స్టార్!

Published on Jul 15, 2022 1:05 pm IST


కోలీవుడ్ టాలెంటెడ హీరో శివ కార్తికేయన్ ఈరోజు తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేశారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు శివ కార్తికేయన్ కొత్త సినిమా టైటిల్ మరియు ఎనౌన్స్‌మెంట్ టీజర్‌ను డిజిటల్‌గా ప్రకటించారు. మావీరన్‌/ మహావీరుడు అనే టైటిల్‌తో విడుదలైన ఈ సినిమా అనౌన్స్ మెంట్ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

శివ కార్తికేయన్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ చేయనున్నాడని టీజర్‌తో కన్ఫర్మ్ అయింది. మడోన్ అశ్విన్ ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. మహావీరుడు రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :