సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

Published on Nov 14, 2022 3:53 PM IST

టాలివుడ్ అలనాటి సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు తెల్లవారుఝామున హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రి లో చేరారు. ప్రస్తుతం ఆయన క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు. కృష్ణకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది.

ఈ మేరకు కృష్ణ హెల్త్ బులెటిన్ ను ఆసుపత్రి వారు విడుదల చేశారు. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న విషయాన్ని వెల్లడించారు. 24 గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేం అని, ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు అని, శరీరం సహకరిస్తుందా లేదా అనేది ఊహించి చెప్పలేము అని అన్నారు. ఇప్పటి నుంచి ప్రతీ గంటా కీలకమే అన్న వైద్యులు మరో 24 గంటల తర్వాత మళ్లీ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తాం అని అన్నారు.

కార్డియక్ అరెస్ట్ తో ఆయన ఆసుపత్రిలో చేరారు, వెంటనే సీపీఆర్ చేశాం. నిన్న అర్థరాత్రి ఆయన్ను ఆసుపత్రికి తీసుకువచ్చారు అని తెలిపారు. కృష్ణ ఆరోగ్యం పట్ల సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు