“అల్లూరి సీతారామరాజు” చిత్రం పై మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అలనాటి సూపర్ స్టార్ కృష్ణ కి వారసుడు గా, తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను, అభిమానులని అలరిస్తూనే ఉన్నారు. తనపై ఎంతో ప్రభావం చూపిన అల్లూరి సీతారామరాజు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భం గా సూపర్ స్టార్ మహేష్ బాబు (SSMB) సోషల్ మీడియా వేదిక గా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అల్లూరి సీతారామరాజుకి 50 ఏళ్లు. మొదటిసారి చూసినప్పుడు నాన్నగారి గంభీరమైన స్క్రీన్‌ ప్రెజెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమా నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, నటుడిగా నా ప్రయాణంపై మరియు తెలుగు సినిమాపై దాని ప్రగాఢమైన ప్రభావాన్ని నేను గుర్తుచేసుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు తదుపరి దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ లో కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Exit mobile version