జవాన్…బ్లాక్ బస్టర్ సినిమా – సూపర్ స్టార్ మహేష్!

Published on Sep 8, 2023 1:26 pm IST


కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజై సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ను చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేశారు.

జవాన్.. బ్లాక్ బస్టర్ సినిమా. అట్లీ, కింగ్ సైజ్ ఎంటర్ టైన్మెంట్ ను కింగ్ తో ఇచ్చారు. కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ తో వచ్చారు. షారుఖ్ ఖాన్ ఔరా, చరిష్మా, స్క్రీన్ ప్రెజెన్స్ మ్యాచ్ చేయలేనిది. జవాన్, షారుఖ్ నివాసంలో యొక్క అన్ని రికార్డు లను బ్రేక్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు మహేష్. సూపర్ స్టార్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రం లో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సంజయ్ దత్, దీపికా పదుకునే, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సినిమాకి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :